పరిశుభ్రతే కీలకం


Wed,September 18, 2019 12:04 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: పరిసరాల అపరిశుభ్రతతో పాటు స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ జ్వరాలు ప్రభలుతున్నాయి. అయితే ప్రతి వైరల్ ఫీవర్ డెంగీ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని మున్సిపల్ వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, మురుగు కాలువలు, నీరు నిలిచిన ప్రదేశాల్లో దోమ నిర్మూలనకు చర్యలు చేపడుతున్నారు.

డెంగీ లక్షణాలు, చికిత్స..
జ్వరం, తలనొప్పి, కళ్లల్లో నొప్పి, ఒళ్లు, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్రని మచ్చలు, చిగుళ్లనుంచి రక్తం కారడం, రక్తంలో ప్లేట్‌లేట్స్ తగ్గిపోవడం. డెంగీకి సోకిన రోగి తాలూకూ లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తికి బీపీ పడిపోకుండా ఓఆర్‌ఎస్ ఇవ్వవచ్చు.

వైరల్ జ్వరాలే అధికం..
తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానకు వస్తున్న వారిలో అధికంగా వైరల్ జ్వరాల బాధితులే ఉంటున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో 1000 నుంచి 1200మంది రోగులు వస్తున్నారు. దవాఖానలో 200 పడకలు ఉండగా, ప్రతి రోజు కనీసం 150- 200 వరకు రోగులు ఇక్కడే ఉండి చికిత్స పొందుతున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...