ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎంపీపీ


Wed,September 18, 2019 12:03 AM

మొయినాబాద్ : ఆరోగ్య సిబ్బంది ప్రజల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. మంగళవారం కనకమామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో డెంగీ నివారణ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. ఈ వ్యాధి గురించి ప్రజలకు, విద్యార్థులకు డాక్టర్లు నర్మద, చంద్రలత అవగాహన కల్పించారు. విద్యార్థులకు, ప్రజలకు ముందస్తు జాగ్రత్త కోసం డెంగీ నివారణ మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ నక్షత్రం సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మమతతో కలిసి విద్యార్థులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలంలో అనేక వ్యాధులకు గురవుతారని.. ఆ దిశగా వైద్య సేవలు అందించాలని చెప్పారు. తొలిదశలోనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఏ గ్రామంలోనైనా ప్రజలు ఎక్కువ జ్వరాల బారిన పడితే వెంటనే అక్కడ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సాధారణ పరిస్థితి వచ్చే వరకు శిబిరాలను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నదని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మర్రి రాంరెడ్డి, ఎంపీటీసీ ప్రభావతి, మండల విద్యాధికారి వెంకటయ్య, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ మయూరి, హెచ్‌ఎం అబ్దుల్ హమీద్, ఉపాధ్యాయులు ఉమారాణి, రాములు, పుష్ప, మంజులవాణి, నర్సింహులు, ధనలక్ష్మి, వార్డు సభ్యులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...