పరిశుభ్రతతోనే ఆరోగ్యం


Mon,September 16, 2019 11:20 PM

మర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని గుర్రంగట్టు తండా, తిమ్మాపూర్ గ్రామాలలో ఆమె పర్యటించారు. 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పారిశుధ్యం, హరితహారం కమిటీలు చేస్తున్న పనులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా చెత్తకుండిల్లోనే వేయాలని, పొడి చెత్తను గ్రామంలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ సెంటర్‌లో తడి చెత్తను రీక్షలో వేస్తే డంపింగ్ యార్డుకు తరలిస్తారని అన్నారు. డంపింగ్ యార్డులకు భూమిని కేటయించారా అని ఆయా గ్రామాల వీఆర్‌వోలను అడుగగా కేటాయించడం జరిగిందని వీఆర్‌వోలు తెలిపారు. గుర్రంగట్టు తండాలో నర్సింగ్ పెంట కుప్ప వేయడంతో 500 జరిమాన విధించారు. ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న నీటి తొట్లు శుభ్రం చేసుకోవాలని అన్నారు. మరుగు దొడ్డి లేని వారు నిర్మించుకోవాలని, అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి ప్రతి నీటి బొట్టును అందులోకి మలించాలని అన్నారు. తండాలో ఉన్న పాఠశాలను సందర్శించి మరుగుదొడ్లను పరిశీలించి మరమ్మతులు చేయించాలని ఆర్‌డబ్యూఎస్ ఏఈని ఆదేసించారు. హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటారు, స్టాండింగ్ కమిటీలు ప్రతి ఇంటికి వెళ్లి హరితహారం మొక్కలు ఎన్ని కావాలని తెలుసుకుని తమకు ఇచ్చిన బుక్కుల్లో రాయాలన్నారు. వచ్చే సంవత్సరం ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కలతో పాటు క్రిష్ణ తులసి 15 మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా దోమలను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మహిళా సమఖ్య జిల్లా అధ్యక్షురాలు ఇందిర, నోడల్ అధికారులు, సర్పంచ్‌లు సోనిబాయి, శేఖర్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...