బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మార్చాలి: డీఆర్‌డీవో జాన్సన్


Mon,September 16, 2019 11:20 PM

ధారూరు: గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మార్చుకోవాలని డీఆర్‌డీవో జాన్సన్ పేర్కొన్నారు. సోమవారం 30రోజుల ప్రణాళికలో భాగంగా ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమస్యలను కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో జాన్సన్ మాట్లాడుతూ .. గ్రామాల అభివృద్ధికి గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇంటి ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఆవరణలో పెంచే గృహోపకరణ మొక్కలను, దోమల వికర్షణ మొక్కలను రైతుల పొలం గట్లపై , పొలాల్లో పెంచే టేకు మొక్కల పెంపకం, రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణం, ప్రార్థన మందిరాలు, దేవాలయాల ఆవరణం, ప్రభుత్వ భూముల్లో హరిత వనాలు, మంచిఫుడ్ కోర్టులు, చెరువు గట్లపైన మొక్కల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 2019-20 సంవత్సరానికిగాను ఆయా విషయాలపై అవగాహన కల్పించి నివేధిక తయారు చేసి తీర్మాణం చేయించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాన్ని హరితవనంగా మార్చుకోవాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, బ్యాగులను వాడకూడదన్నారు. గోనే సం చులలోనే వాడాలన్నారు. మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలన్నారు. ఈ 30రోజుల ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు బాధ్యతయుతంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశాలవెంకట్‌రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్, ఆశావర్కర్లు, యువజన సంఘాల సభ్యులు, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...