గ్రామాల్లో కుల నిర్మూలన జరుగాలి


Mon,September 16, 2019 11:19 PM

వికారాబాద్ రూరల్ : దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో వివక్ష కుల వివక్షను పూర్తిగానిర్మూలించి, సమా సమాజ నిర్మాణం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణానికి వచ్చిన కమిషన్ మెంబర్ రాములుకు కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా, ఎస్పీ నారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధ్దులూర్ ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఎస్సీల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ మెంబర్ రాములు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. సిద్ధులూర్‌లో ఎస్సీ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు తీర్చాలన్నారు. కాలనీలో మురుగుకాలువల నిర్మాణం చేపట్టాలని, నిరంతరం విద్యుత్ ఉండాలని సూచించారు. కాలనీలో ఎప్పుడు విద్యుత్ పోయిన వెంటనే లైన్‌మెన్లు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చాలన్నారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు అయ్యే విధంగా చూస్తామని తెలిపారు. గ్రామంలో బెల్డ్ షాపులు ఎక్కువగా ఉన్నాయని, నిత్యం తాగుతూ జీవితాలు నశనం చేసుకుంటున్నారని, వాటిని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం వ్యాధుల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అండర్ డ్రైనేజ్ సిస్టంను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. గ్రామంలో శుద్ధి జలాలను అందించాలన్నారు. ఎస్సీల కోసం సిద్ధులూర్‌లో కమ్యూనిటీ హాల్, నిరుపయోగంగా ఉన్న బీసీ హాస్టల్‌ను అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువుకునేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం తరుపున ఇండ్లను అందిస్తామని, వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సిద్దులూర్‌లో ఎస్సీల శ్మశాన వాటికకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని తహసీల్దార్ చిన్నప్పలనాయుడును ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందని, వాటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసి ప్రమోదిని, గ్రామ కార్యదర్శి రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...