మత్స్య కారులకు ప్రభుత్వం చేయూత


Mon,September 16, 2019 11:19 PM

వికారాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతగా నిలిచి, మత్య్సకారులు అభివృదికి ఎంతగానో కృషి చేస్తుందని జిల్లా మత్య్సశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్ల పరిధిలో ఉన్న సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌లో చేప పిల్లలు వదిలారు. సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం 2.31లక్షల చేప పిల్లలను వదిలి మత్య్స కారులకు అండగా నిలిచింది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా మత్య్సశాఖ అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మత్య్సకారులకు అండగా ఉండి అందుకుంటుందన్నారు. వికారాబాద్ జిల్లాలో 499 చెరువులు ఉన్నాయని, వాటిలో చేప పిల్లలను వేసేందుకు సిద్ధ్దంగా ఉన్నమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కులాన్ని అందరిస్తుందని వివరించారు. కుల వృత్తులను బతికించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని, అన్ని కులాలను సమన్వయ పరుస్తుందన్నారు. చేపలను అమ్ముకొని జీవించేవారికి ప్రభుత్వం టూ వీల్లర్, ఫోర్ వీలర్, తదితర వాహనలను మత్య్సకారులకు సబ్సిడీ ద్వారా పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వం మత్య్సకారులకు ఇన్సూరెన్సులు అందించి, మరణించిన వారి కుటుంబాలను ఆందుకుంటుందన్నారు. ప్రతి మత్య్సకారుడు ప్రభుత్వం అందించే పథకాలతో లబ్ధి పొందాలన్నారు. గొట్టిముక్ల ఎంపీటీసి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు బసటగా నిలుస్తుందన్నారు. చెరువుల్లో చేపలు వదులడం ద్వారా మత్య్సకారులు చేపలు అమ్ముకొని కుటుంబాలు బతుకుతున్నాయన్నారు.ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి పర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వం సర్పన్‌పల్లి ప్రాజెక్ట్ కోసం నిధులు విడుదల చేసిందని, అభివృద్ధి పనులు త్వరగా జరుపాలని కోరారు. కార్యక్రమంలో గొట్టిముక్ల స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న కుమారి, మత్స్య సహకరం సంఘం చైర్మన్ అంజనేయులు, గ్రామస్తులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...