ఓటరు నమోదు చేయించుకోవాలి


Sun,September 15, 2019 11:04 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : ప్రజాస్వావ్య విలువలను కాపాడటానికి ఓటు హక్కు ఎంతో ఉపకరిస్తుందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఓటరు జాబితా సవరణలో భాగంగా బీఎల్‌వోలు పట్టణంలో ఓటరు జాబితా సవరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన యువత తప్పక ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో ఓటరు నమోదు ప్రక్రియ సులభతరంగా మారిందని, బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఓటును పరిశీలించుకోవాలని, ఓటరు నమోదుతో పాటు ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరించుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. ఓటింగ్‌లో పాల్గొని సుస్థిర ప్రజాస్వామ్య నిర్మాణం చేసుకోవాలంటే ఓటు హక్కు తప్పక పొంది ఉండాలని తెలిపారు. ఇందులో భాగంగా బీఎల్‌వో గోపాల్ మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఓటరు జాబితా సవరణ చేపట్టారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...