మహనీయులను మర్చిపోవద్దు


Sun,September 15, 2019 11:03 PM

వికారాబాద్ రూరల్ : సమసమాజ నిర్మాణం కోసం మనందరికి జీవన మార్గం చూపిన మహనీయులను ఎన్నటికీ మర్చిపోవద్దని అఖిలభారతీయ సామాజిక సహ సంయోజకుడు రవింద్రకిర్‌కోలే పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొండాబాలకృష్ణారెడ్డి ఫంక్షన్‌హాలులో డాక్టర్ హెగ్డేవార్, బాలసాహెబ్ దేవరాస్‌జీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గుర్రం జాషువ, బోయిని భీమన్నను స్మరించుకుంటూ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిస్వార్ధంతో నడిపించగలుగుతున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత అప్పల ప్రసాద్, పాలమూరు విభాగ్ భౌతిక్ ప్రముఖ్, కె.జయదేవ్, డాక్టర్ సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. అనంతరం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...