ప్రజలకు, ప్రభుత్వానికి సంఘాలు వారధిగా ఉండాలి


Sun,September 15, 2019 11:03 PM

మొయినాబాద్: ప్రజా సంఘాలు ప్రజలకు, ప్రభుత్వానికి వారిధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఆర్‌ఎస్ నాయకుడు అనంతరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం మండల కార్యాలయాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ఉద్యమించినప్పుడు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయన్నారు. సంఘాల్లో ఉన్న సభ్యులు నైతిక విలువను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వసంతం, అటవీ శాఖ విశ్రాంతి ఉద్యోగి ఎంఏ వాజిద్, సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు స్వామి, సభ్యులు భాస్కర్, శ్రీనివాస్, మహేందర్, అరవింద్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...