పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం


Sun,September 15, 2019 11:02 PM

షాబాద్, నమస్తే తెలంగాణ: పౌష్టికాహారం తీసుకోవడంతోనే తల్లిబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నాగరకుంట అంగన్‌వాడీ టీచర్ కుసుమకుమారి అన్నారు. మండలంలోని నాగరకుంట అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలను ఆదివారం నిర్వహించారు. పౌష్టికాహార ప్రాముఖ్యతపై గ్రామంలో మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంతో తయారు చేసిన పలు పదార్థాలను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తల్లి, బిడ్డకు సరిపడా పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని టీచర్ చెప్పారు. తాజా ఆకుకూరలు, పండ్లు, పాలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటుకు గురికాకుండా దోమ తెరలు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా కళమ్మ, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...