లోక్ అదాలత్‌లో 30 కేసులు పరిష్కారం


Sat,September 14, 2019 11:30 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : రాజీయే రాజమార్గమని జిల్లా న్యాయమూర్తి మురళీమోహన్ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 30 కేసులను రాజీమార్గంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకోసారి లోక్ అదాలత్ ఏర్పాటు చేసి దీరకాలికంగా కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులకు గురవుతున్నవారికి రాజీ కుదిర్చి పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. 4,5 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను న్యాయవాదుల సమక్షంలో ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇరువర్గాల రాజీ కుదిర్చి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న కేసులకు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయాన్ని వృథా చేసుకోవద్దని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్‌లో సమస్య పరిష్కారం జరిగిందంటే ఇరువురు గెలిచినట్లేనని అన్నారు. ఒకే రోజు ఒకే కుటుంబానికి సంబంధించిన 4 కేసులను లోక్ అదాలత్‌తో పరిష్కరించామని స్పష్టం చేశారు. రాజీపడటానికి చైతన్యం కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కవిత, వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...