30 రోజుల ప్రణాళికపై సీఎంవో కార్యాలయం ఆరా


Sat,September 14, 2019 11:30 PM

-పరిగి ఎంపీడీవోకు వీడియో కాల్ ద్వారా వివరాల సేకరణ
పరిగి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మురళీధర్ అనే అధికారి స్వయంగా పరిగి ఎంపీడీవో కృష్ణకుమార్‌కు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఎక్కడున్నారని ఎంపీడీవోను అడుగగా నస్కల్ గ్రామం వెళ్తున్నట్లు చెప్పారు. దీంతో నస్కల్ గ్రామంలో అమలు జరుగుతున్న 30రోజుల ప్రణాళిక గురించి ముఖ్య మంత్రి కార్యాలయ అధికారి మురళీధర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా గ్రామసభ నిర్వహించి స్థాయి సంఘాల ఏర్పాటు తర్వాత గ్రామంలో పాదయాత్ర జరిపి సమస్యలు గుర్తించడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. అనంతరం ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా మురికికాలువలలో సిల్ట్ తొలగించే పనులతో పాటు రోడ్డుకు ఇరువైపుల పిచ్చిమొక్కల తొలగింపు చేపట్టినట్లు తెలియజేయడంతో పాటు చేసిన పనులకు సంబంధించి వీడియో కాల్ ద్వారా చూపించడం జరిగింది. గ్రామంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి పొడి చెత్తను, ప్లాస్టిక్ వస్తువు లు సేకరించి అక్కడ ఉంచామని చెప్పారు. ఈ సందర్భంగా ఒక దగ్గర భూమి చదును చేస్తుండగా ఇదేమిటని అడుగగా కమ్యూనిటీ భవనం నిర్మాణానికి గ్రామంలో ఉన్న స్థలం చదును చేయడం జరుగుతుందని, ముందుగా ప్రహరీ నిర్మాణం చేపట్టి నిధులు మంజూరు చేస్తే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డి నేటర్ మేడిద రాజేందర్ తెలిపారు. నస్కల్ గ్రామంలో 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన పనులను వీడియో కాల్ ద్వారా వీక్షించిన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి మురళీధర్ పనులు బాగా చేస్తున్నా రంటూ అభినందించినట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మేడిద పద్మమ్మ, ఈవోఆర్‌డీ దయానంద్, నోడల్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...