పని ఒత్తిడి తగ్గించాలి


Fri,September 13, 2019 11:44 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : గ్రామ కార్యదర్శులపై ప్రభుత్వం పనిభారం తగ్గించాలని మండల గ్రామ కార్యదర్శులు కోరారు. పని ఒత్తిడి త ట్టుకోలేక నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో గ్రామ కార్యద ర్శి స్రవంతి ఆత్మాహత్యాయత్నం చేసుకున్న సంఘటనపై శుక్రవారం వారు విచారం వ్యక్తం చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేశారు. హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనుల్లో ఉన్నతాధికారులు గ్రామ కార్యదర్శులపై తీవ్ర పని ఒత్తిడిని పెంచుతుందని వారు ఆ వేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించి వారిని మానసికంగా వేధించరాదని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు రమేశ్, బాలరంగాచారి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...