తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన


Fri,September 13, 2019 11:43 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : పట్టణంలోని 8వ వార్డు లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మోహన్‌లాల్ వైద్య సిబ్బందితో పర్యటించారు. ప్రజలకు త డి, పొడి చెత్త సేకరణపై ర్యాలీ నిర్వహి ంచి గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించా రు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూ చించారు. మురుగు కాల్వల వెంబడి దో మల నివారణకు మందులు పిచికారీ చే యించారు. మండలంలోని అప్పాయిపల్లిలో మహిళా సం ఘాలకు తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతా ఠాకూర్, గ్రామ కార్యదర్శి బాలరంగాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాల్లో కొనసాగుతున్న అదే జోరు..
బొంరాస్‌పేట : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భా గంగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్యం, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. చౌదర్‌పల్లిలో వైస్ ఎంపీ పీ శేరి నారాయణరెడ్డి మురుగు కాల్వల ను శుభ్రం చేయించి అంతర్గత రహదారులను మరమ్మతు చేయించారు. చిల్‌ముల్‌మైలారం, సండ్రకుంటతండాలో సర్పంచ్‌లు లక్ష్మీకాంత్‌రెడ్డి, లక్ష్మీబాయి ఆధ్వర్యంలో మహిళలు శ్రమదానం చేసి రోడ్లను శుభ్రం చేశారు. ఇంటి పరిసరాల్లో పెరిగిన గడ్డి, చెత్త ను తొలిగించారు. మండల కేంద్రంలో ఎంపీడీవో హరినందనరావు పర్యటించారు. మురుగు కాల్వల వెంబడి దోమల నివారణకు మందులు పిచికారీ చేయించారు. మదన్‌పల్లిలో అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...