వినాయకా వీడ్కోలిక


Fri,September 13, 2019 11:42 PM

బొంరాస్‌పేట : మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జనోత్సవం శుక్రవారం కన్ను ల పండువగా ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల ప్రతిష్ఠించిన గణనాథులకు భ క్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు గురువారం రాత్రి వినాయక మండపాల్లో భ జనలు చేశారు. లడ్డూలను వేలం వేయ గా వాటిని సొంతం చేసుకునేందుకు భ క్తులు పోటీలు పడ్డారు. మండపాల్లో ఉద యం ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించారు. వాహనాల్లో గణనాథులను ఉంచి వీధుల గుండా ఊరేగింపులో మహాంతిపూర్ గ్రామానికి చెందిన భజన మండలి భక్తులు ప్రదర్శించిన అడుగుల భజన, చిన్నారుల కోలాటం, మహిళలు బతుకమ్మ ఆడారు. రాత్రి వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. చెరువు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్లకుంటలో గణేశ్ నిమజ్జనం శుక్రవారం నిర్వహించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...