ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి


Fri,August 23, 2019 01:40 AM

బొంరాస్‌పేట : హరితహారం కార్యక్రమంలో ప్రతి పాల్గొని మొక్కలు నాటాలని ఎంపీడీవో హరినందనరావు సూచించారు. గురువారం మండలంలోని ఈర్లపల్లి, సండ్రకుంటతండాల్లో నిర్వహించిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు శంకరమ్మ, లక్ష్మీబాయిలతో కలిసి రైతుల పొలాల్లో మొక్కలు నాటారు. అడువులను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
హరితహారంలో నాటిన మొక్కలను కాపాడితే అడవులు శాతం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, వాతావరణం సమత్యులంగా ఉండి భూతాపం తగ్గుతుందన్నారు. రైతులు పొలం గట్ల వెంట టేకు మొక్కలు నాటుకుంటే భవిష్యత్‌లో మంచి ఆదాయం వస్తుందన్నారు. మహిళలు ఇండ్ల వద్ద పండ్ల మొక్కలు నాటాలని కోరారు. హరితహారంలో ఈ ఏడాది మండలంలో 6.40 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యంకాగా ఇప్పటి వరకు 5.50 లక్షలు మొక్కలు నాటామన్నారు. వీటిలో 3.50 లక్షల టేకు మొక్కలు నాటామని ఎంపీడీవో స్పష్టం చేశారు. మిగిలిన లక్ష మొక్కలను అటవీ ప్రాంతాల్లో, ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములలో నాటిస్తామని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...