దేవాదాయ భూములను కాపాడాలి


Fri,August 23, 2019 01:38 AM

వికారాబాద్ రూరల్ : దేవాదాయ భూములను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ సంధ్యారాణి అన్నారు. గురువారం వికారాబాద్‌లోని అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్నా రు. హరితహారంలో భాగంగా ఆలయ ఆవరణలో మొ క్కలు నాటారు. మోమిన్‌పేటలో శనైశ్వరస్వామి, మాణిక్యప్రభు, బాలాజీ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాదా య భూములను అన్యాక్రాంతం కాకుండా ప్రతి ఒక్క రూ కాపాడుకోవాలన్నారు. బాలజీ దేవాలయ భూ ములు అన్యక్రాంతం అయ్యాయని, ఈ భూములలో బోర్డులు పాతి దేవాదాయ శాఖ భూములుగా గుర్తించడం జరిగిందన్నారు. మోమిన్‌పేటలోని మాణిక్ ప్ర భు దేవాలయ భూమి మొత్తం 42ఎకరాలు ఉందని గుర్తించడం జరిగిందన్నారు. 15రోజుల్లో ఈ భూము లు బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇవ్వడానికి ఆల య ఏఈ శేఖర్‌గౌడ్‌కు ఆదేశించామన్నారు. ఆలయ భూముల్లో ఇతరులు వ్యవసాయ పనులు చేయరాదని, వేలం పాటలో దక్కించుకున్నవారు పను లు చేసుకోవాలన్నారు. ఆలయ భూములు ఎక్కడ అన్యక్రాంతం అయిన ప్రజలు గుర్తించి ఎండోమెంట్ వారికి తెలియజేయాలన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం ఎండోమెంట్ కృషి చేస్తుందన్నారు. ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. పురాతన దేవాలయాలను గుర్తించి ప్రత్యేకశ్రద్ధ చూపించి దూప దీప నైవేధ్యాలు అందేలా చూ స్తామన్నారు. ఆలయ ఆవరణలో మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలన్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులు చూ సేందుకు అందంగా కనువిందు చేయాలన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...