చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


Wed,August 21, 2019 11:31 PM

కులకచర్ల : చిరుధాన్యాల ఉత్పత్తిలో మహిళా రైతు సంఘాల సభ్యులు కీలకపాత్ర వహించాలని డీఆర్డీవో జాన్సన్ పేర్కొన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలోని స్త్రీశక్తిభవనంలో శ్రీరామలింగేశ్వర మహి ళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల ఉత్పత్తిలో మహిళా రైతు ఉత్పత్తిదారులు తమ పాత్ర ను కొనసాగించాలన్నారు. ప్రతి గ్రామంలో చిరుధాన్యాలను ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పత్తి చేసిన చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ సమా ఖ్య సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లలో చిరుధాన్యాలను పండించిన రైతుల ధాన్యాన్ని సేకరించి ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అమ్మేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. కులకచర్ల మండలంలోనే మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నందున జిల్లా యూనిట్‌గా ఈ సమాఖ్యను తీసుకొని చిరుధాన్యాలను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి రైతు తమకున్న పొలాల్లో కొంతమేరకన్నా చిరుధాన్యాలను ఉత్పత్తి చేయాలన్నారు. చిరుధాన్యాలను సమాఖ్య స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తారని అన్నారు. రానురాను చిరుధాన్యాలు ఉత్పత్తి తగ్గి పోవ డం కారణంగా చిరుధాన్యాల ప్రా ముఖ్యతను తెలియజేసి ఎక్కువ గా పండించే విధంగా చూడాల న్నారు.

ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో కస్టమర్ హియరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మోమిన్‌పేట్‌లో కూరగాయల కలెక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు తీర్మాణం చేశారు. కులకచర్ల ఎంపీపీ సతమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో చిరుధాన్యాలను ఉత్ప త్తి చేసేందుకు రైతులు ఉత్సాహాన్ని చూపాలని అన్నా రు. మహిళా సంఘాల ద్వారా రైతులకు చిరుధాన్యాలపై అవగాహణ కల్పించి ఆ దిశగా ఉత్పత్తి అయ్యే విధంగా చూడాలన్నారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు. ఈ సందర్భంగా కులకచర్ల మండల సెర్ప్ సిబ్బంది ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మాణించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత ను గురించి పలువురు వివరించారు.

కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏపీడీ బాలస్వామి, కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, కులకచర్ల ఎంపీటీసీ ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇంధిర, కులకచర్ల మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మమ్మ, డీపీఎం శ్రీనివాస్, రామ్మూర్తి, ఏపీ ఎం శివయ్య, ఈవోపీఆర్డీ సురేశ్‌బాబు, కులకచర్ల ఏపీ ఎం శోభ, కులకచర్ల మండల మహిళా రైతు సంఘాల ప్రతినిధులు, సభ్యులు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...