వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక


Wed,August 21, 2019 11:30 PM

పెద్దేముల్ : ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయిలో వాలీబాల్ క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని జోనల్ సెక్రటరీ, ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో పెద్దేముల్ జోన్‌స్థాయి 14 నుంచి 17 సంవత్సరాలలోపు బాలబాలికల వాలీబాల్ జట్లను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జోనల్ సెక్రటరీ, పీడీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీలకు గాను పెద్దేముల్ జోన్ పరిధిలోని 3 మండలాలకు చెందిన 12 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో నుంచి వాలీబాల్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో అండర్- 14, అండర్-17 విభాగంలో బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగిందని, ఈ ఎంపిక చేసిన జట్లు జిల్లా స్థాయిలో 6 జోన్‌లు పాల్గొనే టౌర్నమెంట్‌లో పాల్గొంటాయని తెలిపారు. ఈ ఎంపికలో వివిధ పాఠశాలలకు చెందిన పీడీలు, పీఈటీలు రాజశేఖర్ రెడ్డి, రాజు, గోపాల్, అంబదాస్, ప్రమోద్, మహిపాల్, గోపిక, రజిత తదితరులు పాల్గొన్నారు.

23వ తేదీన ఖోఖో ఎంపికలు.....
ఈ నెల 23వ తేదీ శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వివిధ పాఠశాలలకు చెందిన 14 నుంచి 17సంవత్సరాలలోపు బాలబాలికలకు ఖోఖో ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని, ఇతర వివరాలకు నం. 94407 69252కు సంప్రదించాలని రాధాకృష్ణ తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...