మొక్కలను నాటి కాపాడుదాం


Wed,August 21, 2019 11:30 PM

పెద్దేముల్: మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ తులసీరమేశ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు వివిధ రకాల మొక్కలను గ్రామ పంచాయతీ ఆవరణలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
హరితహారంలో గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని, పంపిణీ చేసిన మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. కాగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలోని గర్భిణులు, బాలింతలకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే గ్రామస్తులు, రైతులకు ఇప్పటి వరకు మొత్తం 9 వేల 350 వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్యాంసుందర్, గ్రామస్తులు, రమేశ్, మల్లప్ప, అంజప్ప, నిర్మల, రాచమ్మ, సునీత, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
బషీరాబాద్: హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలని ఉపాధిహామీ ఏపీవో శారద పేర్కొన్నారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో హరితహారంలో భాగంగా వార్డుల వారీగా లక్ష్యాన్ని నిర్ధేశించి వార్డు సభ్యులకు బాధ్యతనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు ఎలా నాటాలి, వాటి సంరక్షణ ఎలా అనేదానిపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా వార్డు సభ్యులు పర్యవేక్షించాలని తెలిపారు. పంచాయతీలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అందుకు అనుగుణంగా మొక్కలు నాటి సంరంక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రాజక్, వార్డు సభ్యులు ఆర్తీక్‌గౌడ్, విష్ణు, దుర్గాగౌడ్, ధన్ను రాథోడ్, నాయకులు శ్రావణ్, పవన్‌ఠాకూర్, పంచాయతీ కార్యదర్శి సంజీవ్, టీఏ శ్యామప్ప, ఏఫ్‌ఏ రామరావు, తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...