నూతన చట్టాల కోసం కలెక్టర్ల సలహాలు సేకరించిన సీఎం


Wed,August 21, 2019 12:13 AM

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొత్త రెవెన్యూ చట్టాన్ని వేగవంతంగా అమలు చేసేందుకు రెవెన్యూ చట్టంలోని తగు నిర్ణయాలను ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండేందుకు మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ నూతనంగా తీసుకరాబోయే రెవెన్యూ చట్టంలో రైతులకు సరైన న్యాయం చేకూర్చేలా అభిప్రాయాలు వెల్లడించాలని కలెక్టర్లకు సూచించారు. నూతన రెవెన్యూ చట్టంతో పూర్తిగా అవినీతిని అంతమొందించి రైతులకు ప్రజలకు సరైన న్యాయం చేసేందుకే ఈ చట్టంలో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేసి నూతన చట్టం అమలులోకి తెస్తే అందరికీ సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకు గాను కలెక్టర్లు భూ పరిపాలనకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సమస్యలను వివరించి వాటికి సరైన పరిష్కార మార్గాలు, ప్రజలకు మేలు చేసే అంశాలను తెలియజేయాలన్నారు. కొత్తగా అమలులోకి తీసుకరానున్న రెవెన్యూ చట్టం పూర్తి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉంటుందన్నారు. పంచాయతీల అభివృద్ధి, మున్సిపల్‌ అభివృద్ధికి నూతనంగా పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టం తీసుకరావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యచరణపై ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ 9 గంటల పాటు విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో 60 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికపై సుధీర్ఘంగా చర్చించారు. 60 రోజుల్లో చేపట్టబోయే వివిధ కార్యక్రమాల కార్యచరణపై సుధీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...