వికారాబాద్‌లో వర్షం


Wed,August 21, 2019 12:13 AM

-జిల్లాలో అత్యధికంగా నవాబుపేటలో 65.6 మి.మీ వర్షం
వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: వికారాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం వర్షం భారీగా కురిసింది. నియోజకవర్గంలోని వికారాబాద్‌, ధారూరు, నవాబుపేట, మోమిన్‌పేట, కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి మండలాల్లో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జిల్లాలో సోమవారం కురిసిన వర్షాపాత వివరాలు వాతావరణ శాఖ లెక్కల ప్రకారం.. మర్పల్లి 0.0, మోమిన్‌పేట 14.0, నవాబుపేట 65.6, వికారాబాద్‌, 10.6, పూడూరు 7.2, పరిగి 4.4, కులకచర్ల 0.0, దోమ 10.2, బొంరాస్‌పేట 3.4, ధారూరు 5.4, కోట్‌పల్లి, బంట్వారం 0.0, పెద్దేముల్‌ 6.0, తాండూరు 15.8, బషీరాబాద్‌ 0.0, యాలాల 5.0, కొడంగల్‌ 16.4, దౌల్తాబాద్‌ 0.0 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...