హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వద్దు


Wed,August 21, 2019 12:12 AM

వికారాబాద్‌ టౌన్‌ : గ్రామాల్లో హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వహించకుండా ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని మోమిన్‌పేట ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఏన్కతలలో రెవెన్యూ ప్లానిటేషన్‌ను పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. రోడ్డ పక్కన నాటిన ప్రతి మొక్క బతికేలా కంచె ఏర్పాటు చేయాలని సెక్రెటరీ, సర్పంచ్‌లకు వివరించారు. ఎన్కతల పెద్ద గ్రామమని, పాఠశాలలు, ఆలయాలు, గ్రామం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిలో, ప్రతి ఇంట్లో మొక్కలు పెంచేల చూడాలని కోరారు. టేకు మొక్కలను రైతులు పొలం గట్లపై పెంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

అందరూ భాగస్వాములు కావాలి
మర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏపీవో అంజిరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పంచాలింగాల్‌ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీలో పని చేసే మేటీలకు హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శేఖర్‌, ఎఫ్‌ఎ శేఖర్‌ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అందరి సహకారంతో మొక్కలను కాపాడుదాం
నవాబుపేట : అందరి సహకారంతో హరితహారం మొక్కలను కాపాడాలని మీనపల్లికలాన్‌ సర్పంచ్‌ మాణిక్‌రెడ్డి అన్నారు. బుధవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో నాటిన ప్రతి మొక్క బతికే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీవాణి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని గేటువనంపల్లిలో సర్పంచ్‌ చొరవ, గ్రామస్తులందరి సహకారంతో 400 ట్రీగార్డ్‌లను కొనుగోలు చేసి మొక్కలకు రెండు రోజులుగా ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడం ఒక వంతైతే వాటిని సంరక్షించడం అదనపు బాధ్యతగా తీసుకున్నామని సర్పంచ్‌ రత్నం పేర్కొన్నారు. దాదాపుగా 800 మొక్కలకు ట్రీగార్డ్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ట్రీగార్డ్‌లను అందించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి
బంట్వారం : గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే పథకాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్‌ నర్సింహులు పేర్కొన్నారు. మంగళవారం సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలన్నీ పచ్చని వాతవరంతో, పరిశుభ్రమైన వాతవరంతో ఉండాలని ప్రభుత్వం హరితహారం, ఎస్‌బీఎం పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఇందులో ప్రతి ఒక్క ఇంటి వద్ద ఆరు మొక్కలు పెంచాలన్నారు. ఇవే కాక గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు, సమూహిక స్థలాల వద్ద చెట్లు పెంచాలన్నారు. ఇచ్చిన టార్గెట్‌ మేరకు పంచాయితికి 40 వేల మొక్కలను నాటి, వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శిరీష, ఉప సర్పంచ్‌ హన్మంత్‌ పాల్గొన్నారు.

ధ్యాచారంలో..
వికారాబాద్‌ రూరల్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సర్పంచ్‌ అంజయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్‌ మండల పరిధిలోని ధ్యాచారంలో హరితహారంలో భాగంగా ఉపాధి కూలీలతో పాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అంజయ్య మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పుష్ప, టెక్నికల్‌ ఆసిస్టెంట్‌ భీమయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహేందర్‌, ఉపాధి కూలీలు ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...