సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి


Wed,August 21, 2019 12:12 AM

బొంరాస్‌పేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ కమిటీలలో ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలు తెలసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ మహేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు కోట్ల యాదగిరి, దేశ్యానాయక్‌ పాల్గొన్నారు.

గ్రామ కమిటీ..
మంగళవారం మండలంలోని 10 గ్రామాల్లో ఏకగ్రీవంగా గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఎనికేపల్లి అధ్యక్షుడిగా మల్లేశ్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌గౌడ్‌, రేగడిమైలారం-గోవింద్‌రెడ్డి, శ్యామలయ్యగౌడ్‌, మూడుమామిళ్లతండా-చౌహాన్‌రాజు, జైపాల్‌, లింగన్‌పల్లి- రాములు, మొగులయ్య, హంసాన్‌పల్లి -నర్సింహులు, భీమ్లానాయక్‌, దుద్యాల -నర్సింహులుగౌడ్‌, సాలె సాయిలు, రోటిబండతండా- లక్ష్మణ్‌, తులసీరాం, ఈర్లపల్లి -వెంకట్‌రాంరెడ్డి, నీలి లక్ష్మయ్య, బాపల్లితండా-రమేశ్‌, సంతోశ్‌, వడిచెర్ల - హరీశ్వర్‌రెడ్డి, నర్సింహులు, ఎన్నెమీదితండా-రాములు, హన్మ్యానాయక్‌లను ఎన్నుకున్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...