అంగన్‌వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి


Wed,August 21, 2019 12:11 AM

బొంరాస్‌పేట : మండలంలోని లగచెర్లలోని అంగన్‌వాడీ కేంద్రాల మాదిరిగా అన్ని కేంద్రాలను ఆదర్శంగా, ఆకర్శనీయంగా తీర్చిదిద్దాలని కొడంగల్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో జయరాంనాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని లగచెర్లలో ప్రాజెక్టు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీడీపీవో మాట్లాడుతూ చిన్నారులకు ఆటా పాటల ద్వారా చదువు నేర్పించాలని, కేంద్రాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఆకట్టుకునేలా ఉండాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం క్యాక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కేంద్రాలు బాగుంటే పిల్లల హాజరు కూడా తగ్గకుండా ఉంటుందని సీడీపీవో స్పష్టం చేశారు. కేంద్రాల్లో అన్ని రకాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని సూచించారు. లగచెర్లలోని రెండు కేంద్రాలు ఆదర్శంగా ఉన్నందునే వాటిని స్ఫూర్తిగా తీసుకుంటారని ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్నారులకు యూనిఫాం అందజేసిన సర్పంచ్‌ అనంతయ్యను, సౌండ్‌బాక్సులను అందజేసిన వార్డు సభ్యురాలు బసమ్మను సీడీపీవో జయరాంనాయక్‌ సన్మానించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో కాంతారావు, సూపర్‌వైజర్లు, ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...