నేడు, రేపు కలెక్టర్లతో సీఎం సమావేశం


Mon,August 19, 2019 10:51 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమావేశంకానున్నారు. ప్రగతిభవన్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. అయితే సీఎంతో జరుగనున్న సమావేశానికి జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకున్న కలెక్టర్... భూ పరిపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలోని అంశాలను కలెక్టర్ మస్రత్ ఖనమ్ ఆయేషా సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే కలెక్టర్ల సమావేశంలో కొత్తగా అమల్లోకి తీసుకురానున్న రెవెన్యూ చట్టంతోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలతోపాటు పల్లెలు, పట్టాణాల్లో అమలుచేయనున్న 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భూపరిపాలనలో అవగాహన కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం పెరిగిపోయిన అవినీతి, అక్రమాలను పూర్తిగా రూపుమాపడంతోపాటు అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చట్టం తీసుకొచ్చేందుకుగాను రూపొందించే నిబంధనలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. అంతేకాకుండా వీఆర్వో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతున్న దృష్ట్యా సంబంధిత వ్యవస్థ రద్దు చేయాలా, కొనసాగించాలనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది.అదేవిధంగా కొత్త రెవెన్యూ చట్టంతోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టంపై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా పల్లెల్లో అమలుచేయనున్న 60 రోజుల ప్రత్యేక కార్యాచరణపై కూడా చర్చ కొనసాగనుంది.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...