రుక్కుంపల్లిలోని నంబర్ 47ను సర్వే చేయాలి


Mon,August 19, 2019 10:50 PM

పరిగి,నమస్తే తెలంగాణ: పరిగి మండలం రుక్కుంపల్లి గ్రామంలోని సర్వే నంబర్:47లోని 8.31 ఎకరాల భూమిని సర్వే చేసి గ్రామానికి అప్పగించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు సోమవారం వికారాబాద్ ఆర్డీవో విశ్వనాథాన్ని కోరారు. ఈ మేరకు వారు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. సర్వేనంబర్ 47లో 8.31 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని, అందువల్ల వెంటనే సర్వే చేయాలని కోరారు. అలాగే గ్రామ సమీపంలోని సర్వేనంబర్ 29లో మామిళ్ల లాలయ్య పేరిట 34 గుంటల భూమి చాలా ఏండ్లుగా గ్రామ అవసరాలకు వినియోగించుకుంటుండగా ఇటీవల ఈ భూమి సైతం ఓ వ్యక్తి అక్రమంగా తన పేరిట చేయించుకొన్నారని, ఈ విషయమై చర్యలు తీసుకొని భూములను రక్షించాలని వారు ఆర్డీవోను కోరారు. అట్టి భూమిని డంపింగ్‌యార్డు, ఇండ్ల నిర్మాణం, ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు ఈ భూములు అప్పగించాలని వారు కోరారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...