పత్తి పంటపై అవగాహన


Sat,August 17, 2019 11:20 PM

బషీరాబాద్: తాండూరు పరిశోధన స్థానం వారు మండల పరిధిలోని ఎక్మాయి గ్రామంలో పత్తి పంటపై అవగాహన కల్పించారు. గత సంవత్సరం నుంచి ఎక్మాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో శనివారం గ్రామంలోని పాఠశాలకు లయన్స్ క్లబ్ వారి సహాకారంలో మంచినీటి ట్యాంకును బహుకరించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రైతులకు పత్తిపంటలో ఆశించే చిడపురుగులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సుధాకర్, శాస్త్రవేత్త ఎస్ సందీప్, కె సంధ్యారాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...