ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి


Fri,August 16, 2019 11:12 PM

-దామర్‌చెడ్, వాల్యానాయక్‌తండా సర్పంచ్‌లు
బషీరాబాద్: ప్రతి ఇంటికి ఆరు మొక్కలు తప్పక నాటాలని దామర్‌చెడ్, వాల్యానాయక్‌తండా సర్పంచ్‌లు నర్సిరెడ్డి, శివలు పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహా అవసరాలకు అవసరమయ్యే మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వాటిని నాటి సంరక్షించాలని సూచించారు. గ్రామాలు పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పొలం గట్లపై, ఇంటివద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రజలను, గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, టీఏ నారాయణ, తదితరులు పాల్గొన్నారు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...