స్కాలర్‌షిప్‌లు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి


Fri,August 16, 2019 11:10 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందే విధంగా అధికారులు సత్వరం చర్యలు చేపట్టాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తుందన్నారు. విద్యార్థులకు ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ఎంపీడీవోలు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులతో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్లు పాఠశాలలను సందర్శించి వారికి కావాల్సిన సహకారం అందించి, కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి స్కాలర్‌షిప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడికక్కడే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు పూర్తి చేయించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ల నిధులు విడుదలైనందున అకౌంట్‌లేని విద్యార్థులకు వెంటనే ఖాతాలు తెరిపించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మోతీలాల్, జడ్పీ సీఈవో శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీవో జాన్సన్, డీఈవో రేణుకాదేవి, డీపీవో రిజ్వాన, ఎస్సీ సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు విజయలక్ష్మి, పుష్పలత, ఎస్టీ వెల్ఫేర్ అధికారి కోఠాజీ, డీడబ్ల్యూవో జోత్స్న, ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...