ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


Thu,August 15, 2019 11:10 PM

బొంరాస్‌పేట : 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ హేమీబాయి, తహసిల్దార్ వీవీ వరప్రసాదరావు, ఎంఈవో రాంరెడ్డి, వైద్యాధికారి రవీంద్రయాదవ్, ఎస్‌ఐ వెంకటశీను, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పాపిరెడ్డి, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సబితారాణి, కేజీబీవీ ఎస్‌వో రాధిక వారి వారి కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై ఉపాధ్యాయులు,అంగన్‌వాడీ కేంద్రాలపై కార్యకర్తలు, గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంతోపాటు దుద్యాల, తుంకిమెట్ల, మెట్లకుంట, గౌరారం, ఏర్పుమళ్ల తదితర గ్రామాలలో జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు.

చిల్‌ముల్‌మైలారంలో పాఠశాల విద్యార్థులు 50 మీటర్ల పొడవున్న జాతీయ పతాకాన్ని పైకెత్తుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీడీవో హరినందనరావు, తదితరులు పాల్గొన్నారు.

దౌల్తాబాద్‌లో..
దౌల్తాబాద్: ప్రజాసంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా దౌల్తాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్‌కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...