విద్యుత్ సమస్యలకు చెక్


Thu,August 15, 2019 11:10 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : రెండు నెలల్లో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యుత్ ఏడీ కరుణాకర్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాటాడారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ పవర్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి అందిన ఆదేశాల ప్రకారం నేటి నుంచి వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను గుర్తిస్తామన్నారు. స్తంభాలు విరుగడం, కిందికి పొంచిఉన్న విద్యుత్ లైన్‌లు, డ్యామేజీ, పాత విద్యుత్ తీగలు తదితరల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

గ్రామాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పరిశీలించి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ప్రత్యేకంగా నివేదకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం ప్రత్యేకంగా బడ్జెట్ మంజూరై పరిస్తారమవుతాయని తెలిపారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదికను అందిచే విధంగా సీఎం ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలు లేని విధంగా చర్యలు చేపట్టి పట్టణ తరహాలో గ్రామాల్లో విద్యుత్ సరఫరా చేపట్టేందుకు ఈ పవర్ వీక్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. పవర్ వీక్ అంశంపై నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల ఏఈలతో పాటు లైన్ మెన్‌లకు పూర్తి అవగాహన కల్పిసున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ రఘువీర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...