కిక్కిరిసిన రాఖీ దుకాణాలు


Wed,August 14, 2019 11:07 PM

-రెట్టింపు ధరలతో కొనుగోలు దారుల బెంబేలు
కొడంగల్, నమస్తే తెలంగాణ : శ్రావణ మాసంలోని పౌర్ణమిని పురస్కరించుకొని జరుపుకునే రాఖీ పౌర్ణమి వేడుకతో పట్టణంలో సందడి నెలకొంది. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాల్లో చిన్నారులతో పాటు మహిళలు రాఖీల కొనుగోళ్లతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మూడు రోజుల క్రితం నుంచి రాఖీల విక్రయాలు కొనసాగుతుండగా గురువారం రాఖీ పౌర్ణమి వేడుక కావడంతో మరింతగా గిరాకీలు పెరిగాయి. కాగా గత సంవత్సరం కంటే అధికంగా ధరలు ఉన్నాయని మహిళలు పేర్కొంటున్నారు. అన్నా, చెల్లెండ్ల అనురాగానికి ప్రతీక కాబట్టి రాఖీ ధరలను కాకుండా వివిధ ఆకర్శణీయమైన రాఖీలను కొనుగోలు చేస్తున్నామని మహిళలు పేర్కొంటున్నారు. జెండా వేడుక రోజే రాఖీ పౌర్ణమి కావడంతో రెండు వేడుకలను సిద్ధం అవుతున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...