ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి


Wed,August 14, 2019 11:06 PM

బొంరాస్‌పేట : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తహసీల్దార్ వీవీ వరప్రసాదరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని దుద్యాల ఉన్నత పాఠశాలలో సర్పంచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ మహ్మద్ ఖాజా, హెచ్‌ఎం శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చౌదర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంఈవో రాంరెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ మొక్కలు నాటారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...