డిజిటల్ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,August 14, 2019 11:06 PM

బొంరాస్‌పేట : పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విధానం ద్వారా బోధిస్తున్న పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంఈవో రాంరెడ్డి కోరారు. బుధవారం మండలంలోని చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో డిజిటల్ పాఠాలను వారు ప్రారంభించారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పాఠశాలలకు డిజిటల్ పరికరాలను పంపిణీ చేసిందన్నారు. తెరలపై దృశ్యాలను చూపిస్తూ పాఠాలను బోధించడం వల్ల విద్యార్థులు సులభంగా నేర్చుకోగలుగుతారని, వినడం కంటే చూడటం ద్వారా గుర్తుండిపోతాయన్నారు. పదో తరగతి విద్యార్థులు వీటిని బాగా ఉపయోగించుకుని మంచి ఫలితాలు తేవాలని కోరారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈవో రాంరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, హెచ్‌ఎం శ్రీహరిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...