సొంతూరికి సహాయం చేయాలి


Wed,August 14, 2019 11:05 PM

-సంగారెడ్డి టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మొల్లప్ప
బంట్వారం: పుట్టిన ఊరుకు తన వంతు సహాయం చేయాలనే లక్ష్యం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా టౌన్ అధ్యక్షుడు మొల్లప్ప పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తన స్వ గ్రామం బొపునారం వచ్చి, 135 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎంత సంపాదన కలిగిన సొంతూరికి సేవ చేయాలని సంకల్పించానన్నారు. తాను చదివే రోజుల్లో ఈ పాఠశాలలో విద్యార్థులు ఎంతో దీన పరిస్థితిని ఎదుర్కొనేవారని, అలాంటి స్థితి నేడు నా పాఠశాలకు ఉండరాదని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని ఈ కార్యక్రమానికి ఒడి గట్టానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అనేక సదుపాయాలు కల్పిస్తుందని, దీంతో విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు.

గ్రామంలో ఎంతో మంది కోటీశ్వరులున్నారని, వారంత తమ వంతుగా గ్రామాభివృద్ధికి సహాకరించాలని ఆకాంక్షించారు. సహృదయం ఉన్న దాతలు ముందుకు వచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నన్నే సాబ్, హెచ్‌ఎం వెంకటయ్య, గ్రామస్తులు సాయన్న సార్, మైపాల్, సుధాకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...