అవయవదానంతో ప్రాణం పోయవచ్చు


Tue,August 13, 2019 11:57 PM

పెద్దేముల్ : ఒకరి అవయవదానంతో 8 మందికి ప్రాణం పోయవచ్చునని జిల్లా లయన్స్ క్లబ్ 320(ఏ) గవర్నర్ రమేశ్ చంద్ర పండిత్ అన్నారు. మంగళవారం మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, కళాశాలలో 13 ఆగస్టు ప్రపంచ అవయవదాన దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులకు అవయవదానంపైన అవగాహన సదస్సును లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా లయన్స్ క్లబ్ 320(ఏ) గవర్నర్ రమేశ్ చంద్రపండిత్ మాట్లాడుతూ విద్యార్థులు అవయవదానంపైన అవగాహన కలిగి ఉండాలని, బ్రెయిన్ డెడ్ అయినా వారి నుంచి మాత్రమే అవయవదానం తీసుకొంటామని, అందుకు రాష్ట్రంలో జీవన్‌దాన్ పనిచేస్తుందని అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యుడు డా॥ జయప్రసాద్ సివిల్ సర్జన్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేత్రదానం, రక్తదానంపై అవగాహన కలిగి ఉన్నట్లు అవయవదానంపై కూడా అవగాహన కలిగియుండాలని తెలిపారు. మనిషి చనిపోయిన బతికుండాలంటే అందుకు ఏకైక మార్గం అవయవదానం చేయాలని, అమ్మ జన్మనిస్తే - అవయవదానం పునర్ జన్మనిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అవయవదానాన్ని ప్రోత్సహించి పది మందిని బతికించి మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని ఇది ఒక సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పాఠశాల ఆవరణలో జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ రమేశ్ చంద్ర పండిత్ మొక్కను అందరితో కలిసి నాటారు. సమాజంలో మార్పు తీసుకురావాలని విద్యార్థులతో కలిసి లయన్స్ క్లబ్ వారు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు సభ్యుడు రవీందర్ రెడ్డి, మహాత్మ జ్యోతిబా ఫూలే జాతీయ అవార్డు గ్రహీత కె.వెంకటయ్య, మన్‌మోహన్ సార్డా, జహీర్ అహ్మద్, మురళీ, చంద్రకాంత్, వరప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...