చిలుకూరులో జటాయువు సేనకు అంకురార్పణ


Tue,August 13, 2019 11:57 PM

మొయినాబాద్ : సమాజంలో ప్రతి మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రతి పురుషుడు జటాయువుగా తయారు కావాలని, సమాజంలో ప్రతి ఆడపిల్లకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పురుషుడిపై ఉందని, ఆ జటాయువులను చిలుకూరు బాలాజీ నుంచే తయారు చేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో స్వామి వారి అనుగ్రహంతో జటాయువు సేనకు ఆలయ చైర్మన్ ఎంపీ సౌందరరాజన్ సౌజన్యంతో అర్చకులు రంగరాజన్, గోపాలకృష్ణలు అంకురార్పణ చేశారు. మొదటి జటాయువుగా కార్వాన్‌కు చెందిన నదీమ్‌ను ఆలయ అర్చకులు రంగరాజన్ ప్రకటించారు. నదీమ్ గత 20 రోజుల క్రితం ఓ కిడ్నాపర్ నుంచి బాలికను కాపాడటంతో అతన్ని మొదటి జటాయువుగా ప్రకటించి అతనికి రక్షాసూత్రను కట్టి, స్వామి వారికి సమర్పించిన పూలమాల, శాలువాతో సన్మానించి భక్తులకు పరిచయం చేశారు. ప్రతి యువకుడు, పురుషుడు నదీమ్ మాదిరిగా జటాయువుగా తయారై సమాజంలోని మహిళలకు, ఆడపిల్లలకు రక్షణగా నిలువాలని అర్చకులు రంగరాజన్ పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆలయ గర్భగుడి ముందు భాగంలోని ప్రధాన మండపంలో తులసి అమ్మవారిని తులసి అలంకారణతో స్వామి వారి ముందు జటాయువు రక్షా సూత్రాన్ని ఆరాధన, ఆదిత్య పారాయణం చేసి, అమ్మవారి అష్టాత్రంతో పారాయణం చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...