ఉరి శిక్షే సరి


Tue,August 13, 2019 11:57 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: 4 ఏండ్ల 7 నెలల చిన్నారిని అత్యాచారం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తాండూరు నియోజకవర్గంలో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించారు. తాండూరు పట్టణంలో ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా హన్మకొండా ఘటన మరవకముందే తాండూరు నియోజకవ్గం పెద్దెముల్ మండలంలో ఓ గ్రామంలో నగేశ్ అనే యువకుడు చిన్నారిపై మానవ మృగంలా ప్రవర్తించడం చాలా ద్రోహమైన చర్యగా పేర్కొన్నారు. చిన్నారిపై అత్యాచారం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని ఉరితీయడమే సరైన శిక్ష అని పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్తి నర్సింహ నమస్తే తెలంగాణతో ఫోన్‌లో మాట్లాడుతూ సభ్యసమాజం తలవంచుకునే విధంగా ప్రవర్తించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలన్నారు. మానవత్వం మరచి చిన్నారులపై, బాలికలపై అత్యచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తేనే మరోమారు ఇలాంటి ఘటనలు జరుగవన్నారు. మహిళా సమాక్య అధ్యక్షురాలు శకుంతలతో పాటు పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, నేతలు మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న పాపపై ఇలా జరుగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కఠినంగా శిక్షించాలి
పెద్దేముల్ : చిన్నారిపైన అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్ అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఏబీవీపీ, బజరంగ్‌దళ్, హిందూ వాహిని సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామీం ప్రాంతాల్లో ముఖ్యంగా చిన్నారులపైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి యువకులు నడుంబిగించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.చిన్నారిపైన అత్యాచారం చేసిన నిందితున్ని చట్ట రీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి గ్రామీణ ప్రాంతంలో జరుగుకుండా ప్రజలకు ప్రజాప్రతినిధులు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు .కార్యక్రమంలో ఏబీవీపీ, బజరంగ్‌దళ్, హిందూ వాహిని సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...