కార్పొరేట్ తరహాలో పోలీస్ ఠాణాలు


Tue,August 13, 2019 11:54 PM

బషీరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 5ఎస్ మెథడాలజీ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు అవసరమైన వనరులను కల్పిస్తుందని తాండూరు డీఎస్పీ రామచంద్రుడు అన్నారు. మంగళవారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, రికార్డులు అమర్చిన విధానం చూశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజవర్గంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చాలా పరిశుభ్రంగా ఉందని ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి కితాబిచ్చారు. ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పత్రి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. 5ఎస్ మెధడాలజీ ప్రకారం విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందన్నారు. పోలీస్ విధులను 12 విభాగాలుగా విభజించి పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఒక్కొక్కరికీ ఒక్కో విభాగాన్ని అప్పగించారు. ఎవ్వరి బాధ్యత వారు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విధుల్లో బాధ్యతతో పాటు, పరిశుభ్రంగా ఉండాలన్నారు. రికార్డులను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి విషయం ఎస్‌ఐ చూసుకోవాల్సిన అవసరం లేదని, మిగతా సిబ్బందికి కూడా బాధ్యత ఉంటుందన్నారు. ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ నర్సింహులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...