బషీరాబాద్‌లో ఇరు వర్గాల ఘర్షణ


Tue,August 13, 2019 11:54 PM

బషీరాబాద్: ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పరిస్థితిని చేయిదాటకుండా చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ హుటాహుటిన బషీరాబాద్ ఠాణాకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు నుంచి వాహనంలో కోడెదూడను తీసుకోస్తుండగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు ఇందర్‌చెడ్- బషీరాబాద్ రోడ్డు మార్గంలో అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. విషయం తెలుసుకున్న మరో వర్గం గొడవ జరిగే ప్రదేశానికి వెళ్లడంతో గొడవ పెద్దగామారి కొట్టుకున్నారు. విషయం ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున్న మద్దతు దారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఒక వర్గాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచి, మరో వర్గానికి చెందిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ బయట ఉంచారు. పెద్ద ఎత్తున ఠాణాకు వచ్చిన ఇతరులను అక్కడి నుంచి పంపించారు. ఇతర పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు, సిబ్బంది బషీరాబాద్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్తగా బషీరాబాద్‌లోని దుఖానాలను ముసివేయించారు. డీఎస్పీ రామచంద్రుడు ఠాణాలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలకు చెందిన ఘర్షణ పడిన సంఘటనలో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గంకు చెందిన వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...