కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకోవాలి


Tue,August 13, 2019 11:54 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2019-20 సంవత్సరానికి కార్పొరేషన్ లోన్లకు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఆర్డీవో మోతీలాల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 21 నుంచి 55 ఏండ్లు కలిగిన క్రిస్టియన్ మైనార్టీ యువకులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షల ఆదాయం కలిగి ఉండాలన్నారు. లక్ష రుణానికి 80 శాతం సబ్సిడీ, రూ. 1 లక్ష నుంచి 2 లక్షల రుణానికి 70 శాతం సబ్సిడీ, 10 లక్షల రుణానికి 60 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు.క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్‌కు ఆగస్టు 10 నుంచి 24వ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. www.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు టీఎస్‌సీఎంఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ నెం. 040-23391067 నంబర్‌కు ఫోన్ చేయాలన్నాని సూచించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...