చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచాలి


Tue,August 13, 2019 11:54 PM

వికారాబాద్ రూరల్/ధారూరు : : చిరుధాన్యాలో పోషక విలువలు మెండుగా ఉంటాయని, రైతులు పండించేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని జైదుపల్లి, గోధుమగూడ, ధారూరు మండల పరిధిలోని గట్టెపల్లిల్లో చిరుధాన్యాల పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోధుమగూడ, జైదుపల్లి గ్రామాల్లో కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తున్నారని అన్నారు. వీటితో పాటు చిరుధాన్యాలను పండించాలన్నారు. పూర్వకాలంలో రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు పండించి ఆహారంగా తీసుకునేవారన్నారు. వారు ఎక్కువ రోజులు జీవించేవారని గుర్తు చేశారు. చిరుధాన్యాలలో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలన్నారు. ఉబకాయం సమస్య, మధుమేహం, రక్తహీనత నివారించేందుకు చిరధాన్యాలు తోడ్పడుతాయన్నారు. చిరుధాన్యాల్లో పోషకాలు రక్తపుష్టికి , ఎముకల బలిష్టానికి, పిల్లల ఎదుగుదలకు, గర్భిణులకు కావాల్సిన పోషకాలు ఉంటాయన్నారు. చిరు ధాన్యాల వల్ల గుండె జబ్బులు వంటి రోగాలు నయం అవుతాయన్నారు. బియ్యం, గోదుమలతో కంటే పోషకాలు ఎక్కువగా ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు చిరుధాన్యాల్లో పొందవచ్చన్నారు. చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, సజ్జలు వంటివి చిరుధాన్యాల కిందకు వస్తాయన్నారు. రాగుల్లో అనేక పోషక విలువలు కలిగి ఉండి పెద్దలకు, స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా పని చేసుందని తెలిపారు. రాగులకు చలువ చేసే లక్షణం కలిగి ఉండటం ద్వారా ప్రజలు జావ, అంబలి తయారు చేసుకొని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారన్నారు. రాగుల్లో ఖనిజ లవనాలు, ఐరన్, కాల్షియం అధికంగా ఉండి అన్ని ధాన్యాల్లో కన్నా ఎక్కువగా 344మి.గ్రా ఉండటం వల్ల ఎముకలు పటిష్టతకు చాలా మంచిదని తెలియజేశారు. ఈ పంటలు పండించడంలో రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఏఈవో అనీల్, సర్పంచ్ ఎల్లమ్మ, ఉప సర్పంచ్ సురేశ్, పంచాయతీ కార్యదర్శి నవనీత, అంగన్‌వాడీ టీచర్ రాణి, గ్రామస్తులు వెంకటేశ్, నర్సింహులు, తుకారం, గట్టెపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, వికారాబాద్ ఏడీఏ వినోద్‌కుమార్, మండల వ్యవసాయాధికారి జ్యోతి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంజీవ్‌రాథోడ్, ధారూరు ఇన్‌చార్జి ఎంపీడీవో మున్నయ్య, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ జానకీబాయి, నాయకులు నర్సింహారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, కార్యదర్శి కిషన్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...