తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన అవసరం


Tue,August 13, 2019 11:54 PM

తాండూరు రూరల్: తడి, పొడి చెత్త నిర్వహణ పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని డీఆర్‌డీవో జాన్సన్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు మండలంలోని ఖాంజాపూర్‌లో సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పై గ్రామస్తులకు అవాగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖాంజాపూర్‌ను ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. సాలీడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ అంటే ఏమిటో తెలియాలన్నారు. దీనిపై గ్రామస్తులకు త్వరలో శిక్షణ ఇస్తామని తెలిపారు. మనం నిత్యం వాడే వస్తువుల్లో తడి, పొడి చెత్త ఉంటుందని తెలిపారు. ఇండ్లలో మిగలిపోయిన ఆహార పదార్థాలు, పానియాల వంటివి తడి చెత్తకిందకు వస్తాయన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు, వాడేసి బస్తాలు, గొనే సంచులు, గాజుల వంటివి పొడి చెత్తకిందకు వస్తాయని తెలిపారు. వీటిని గ్రామంలో ఎక్కడ బడితే అక్కడ వేయకుండా ఓ చోటకు తరలించాలని సూచించారు. గ్రామ పంచాయతీలో ఓ రిక్షా ఏర్పాటు చేసి, అందులో తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి, రిక్షాలో వేస్తే ఆ చెత్త, చెదారాన్ని గ్రామంలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డుకు తరలిస్తారని తెలిపారు. తడి చెత్తతో కంపోస్టు ఏరువులు తయారు చేయవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి ఇతర అవసరాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఇంటికి రెండు డబ్బాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇంట్లో వాడి వృథాగా ఉండే వస్తువులను తడి, పొడి చెత్తల డబ్బాలు వేయాలని సూచించారు. ఇప్పటికే వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. గ్రామస్తులు అందరూ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందంచాలని ఆయన కోరారు. కార్యక్రమలో గ్రామ సర్పంచ్ లలిత, ఏపీవో నరోత్తంరెడ్డి, టెక్నికల్ అధికారి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

డంపింగ్ యార్డును పరిశీలించిన డీఆర్‌డీవో
అంతకుముందు గ్రామంలోని సర్వే నెం.28 ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును సర్పంచ్ లతితతో కలసి డీఆర్‌డీవో జాన్సన్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఉపాధి హామీ ఏపీవో నరోత్తంరెడ్డిని ఆదేశించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...