మట్టి గణపతులను పూజించాలి


Tue,August 13, 2019 11:53 PM

వికారాబాద్ రూరల్ : మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామంలో మట్టి గణపతుల గురించి తెలియాజేస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ మట్టి గణపతులను పూజించడం ద్వారా కాలు ష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం ఏర్పాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నారు.

పర్యావరణాన్ని కాపాడుదాం..
నవాబుపేట : మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామని సర్పంచ్ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో విద్యార్థులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగులతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిని చాటుకోవడం పొరపాటుకాదని దీంతో పర్యావరణానికి విఘాతం కలుగకూడదన్నారు. అందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాండు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...