టాప్‌గేర్


Mon,August 12, 2019 10:55 PM-రెండు లక్షలు దాటిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు
-జిల్లాలో తిరుగులేని పార్టీగా అధికార పార్టీ టీఆర్‌ఎస్
-నాలుగు నియోజకవర్గాల్లో పూర్తైన సభ్యత్వ నమోదు
-కొనసాగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ
-మరో వారం రోజుల్లో గ్రామ కమిటీల ఎన్నిక పూర్తి చేసేందుకు చర్యలు
-పరిగి నియోజకవర్గంలో ఇప్పటికే 80 శాతం పూర్తైన గ్రామ కమిటీల ఎన్నిక

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయింది. అయితే జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లోనూ అన్ని వర్గా ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పండుగలో పాల్గొని సభ్యత్వాలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న అనేక పథకాలతో జిల్లాలోని ప్రజల నుంచి టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమానికి సూపర్ స్పంద న లభించింది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ మొదలుకొని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఇలా అందరూ భాగస్వాములై జిల్లాలో ఏ పా ర్టీకి లేని విధంగా 2 లక్షలకు పైగా సభ్యత్వాన్ని నమోదు చేయించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం సభ్యత్వ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే ప్రక్రియ కొనసాగుతున్నది, మరో రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు పొందుపర్చే ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు జిల్లా పార్టీ యంత్రాంగం చర్య లు చేపట్టింది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కావడం తో గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియను వీలైనంతా త్వరితగతిన పూర్తి చేసేందుకుగాను జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఎ మ్మెల్యేలు ఆనంద్, నరేందర్ రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడి ప్రత్యే క దృష్టి సారించారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి సంబంధి ంచి సాధారణ సభ్యత్వానికి రూ.30లు, క్రియాశీల సభ్యత్వానికి రూ.100లను చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. మరోవైపు మరో వారంలోగా గ్రామ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను, మండల కమిటీలను కూడా ఎన్నుకోనున్నారు.

2,00,875 లక్షల సభ్యత్వాలు...
జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా సా గింది. జిల్లాలోని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలతో పాటు పరిగి, తాండూరు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జి గట్టు రామచంద్రరావు, వికారాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లోని క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదును పూర్తి చేశారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కలిపి పార్టీ సభ్యత్వ నమోదు మొత్తం రెండు లక్షలు దాటింది. కొడంగల్ నియోజకవర్గంలో 50,375 సభ్యత్వాలను నమోదు చేయ గా, వీటిలో క్రియాశీలక సభ్యత్వం 17,875 సభ్యత్వాలు, సా ధారణ సభ్యత్వ నమోదుకు సంబంధించి 32,500 సభ్యత్వాలను నమెదు చేసుకున్నారు.

అదేవిధంగా పరిగి నియోజకవర్గం లో 50 వేల సభ్యత్వాలు నమోదు చేశారు, అందులో క్రియాశీలకం 17,500 సభ్యత్వాలు కాగా, సాధారణ సభ్యత్వానికి సం బంధించి 32,500ల సభ్యత్వాలను పూర్తి చేశారు. తాండూరు నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేశారు, అం దులో క్రియాశీలకం 17,500 సభ్యత్వాలు కాగా, సాధారణ స భ్యత్వానికి సంబంధించి 32,500ల సభ్యత్వాలను పూర్తి చేశా రు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 60 వేల సభ్య త్వం టార్గెట్‌గా నిర్ణయించగా 50,500 సభ్యత్వాలు ఇప్పటి వరకు పూర్తి చేశారు, అందులో క్రియాశీలక సభ్యత్వం 1800 0లు కాగా సాధారణ సభ్యత్వం 32,500ల సభ్యత్వం ఇప్పటి వరకు పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా సభ్యత్వాలను పూర్తి చేయనున్నారు. అయితే జిల్లాలో 2 లక్షల సభ్యత్వం టీఆర్‌ఎస్ పార్టీకి నమోదు కావడంతో జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారైంది. జిల్లాలో ఏ పార్టీకి లేని విధంగా గులాబీ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అయితే జిల్లాలో మిగతా ఏ పార్టీకి కూడా 50 వేల సభ్యత్వం కూడా లేకపోవడం గమనార్హం.

1,40,030 సభ్యత్వాల ఆన్‌లైన్ పూర్తి...
సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,40,030 సభ్యత్వ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరిగింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సభ్యత్వ వివరాలకు సంబంధించి అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో 40,180 సభ్యత్వాలు, వికారాబాద్ నియోజకవర్గంలో 39,526 సభ్యత్వాలు, పరిగి నియోజకవర్గానికి సంబంధించి 31,025 సభ్యత్వాలను, తాండూరు నియోజకవర్గానికి సంబంధించి 29,299 సభ్యత్వ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరిగింది. అయితే సభ్యత్వాల ఆన్‌లైన్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

మరో వారంలోగా గ్రామ కమిటీలు పూర్తి...
వారంలోగా మండల, గ్రామ కమిటీల ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు పార్టీ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అయితే క్షేత్రస్థాయిలోని క్యాడర్ కూడా బాధ్యతగా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలంటే కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించడంతో గ్రామ, మండల కమిటీల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అయితే జిల్లాలో ఎంపీతోపాటు వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో పాటు మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులను ఛేజిక్కించుకొని బలమైన పార్టీగా తయారైన గులాబీ పార్టీ గ్రామ గ్రామాన పార్టీ సభ్యత్వాలు చేసి మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది.

అయితే వికారాబాద్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల ఎన్నికకు సంబంధించి ధారూరు మండలంతో పాటు వికారాబాద్ మండలం, వికారాబాద్ పట్టణంలో పార్టీ కమిటీల ఎన్నిక పూర్తయింది. మర్పల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో మిగతా గ్రామాల్లో కమిటీల ఎన్నిక కొనసాగుతున్నది. మరోవైపు మోమిన్‌పేట మండలంలో పాటు బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 80 శాతం గ్రామాల్లో గ్రామ కమిటీల ఎన్నిక పూర్తయింది. కొడంగల్ నియోజకవర్గంలో నేటి నుంచి గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియను చేపట్టనుండగా, తాండూరు నియోజకవర్గంలో మరో రెండు రోజుల్లో గ్రామ కమిటీల ఎన్నికను చేపట్టనున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...