నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి


Mon,August 12, 2019 10:50 PM

-ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
పెద్దేముల్ : నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ కుమారుడు గోపాల్‌గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు సీఎం సహాయ నిధి ద్వారా రూ. 60వేల రూపాయల చెక్కును తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఒక వరం లాంటిదని, నిరుపేదల కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపి వారి ముఖాల్లో ఆనందాన్ని నిలిపారన్నారు. కార్యక్రమంలో నాయకులు మురళీకృష్ణ, సాయిని నారాయణ రెడ్డి, పట్లోళ్ల నర్సింహులు, సంతోశ్‌గౌడ్, రాజన్ గౌడ్, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...