ఉద్దండాపూర్‌లో పరిశుభ్రత వారోత్సవాలు


Mon,August 12, 2019 10:50 PM

తాండూరు రూరల్: గ్రామంలో పరిశుభ్రతను పాటించి,ఆరోగ్యంగా జీవించాలని తాండూరు మండలంలోని ఉద్దండాపూర్‌లో సర్పంచ్ కౌసల్య తెలిపారు. సోమవారం గ్రామంలో పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా గ్రామంలోని వీధులన్నీంటిని సర్పంచ్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. మురుగు కాలువలు, రోడ్లపై పెరుకుపోయిన చెత్తచెదారాన్ని ట్రాక్టర్ల ద్వారా తొలిగించి, డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా ఇప్పటికే ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు 80 శాతం పైగా నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ఇంకా కొంత మంది నిర్మించుకోవాలని తెలిపారు. అదేవిధంగా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటే గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేశవరావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు నర్సింహులు, తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...