తండా అభివృద్ధికి అందరూ సహకరించాలి


Mon,August 12, 2019 10:50 PM

-భోజ్యనాయక్‌తండా సర్పంచ్ శాంతి
బషీరాబాద్: తండా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భోజ్యనాయక్‌తండా సర్పంచ్ శాంతి పేర్కొన్నారు. సోమవారం తండాలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండాలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు, హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూడా ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి కి ఆరు మొక్కలు తప్పక నాటాలని సూచించారు. తండాలో మరుగు కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తండా అభివృద్ధికి చేసిన ఖర్చులను సభ్యుల దృష్టికి తెచ్చారు. తండాను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలలో తవ్వించిన బోరుబావికి మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభింప జేశారు. కార్యక్రమంలో జూనియర్ పం చాయతీ కార్యదర్శి సంధ్యారాణి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...