పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Mon,August 12, 2019 10:49 PM

ధారూరు : పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని సర్పంచ్ చంద్రమౌళి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉన్న ము రుగు కాల్వలపై పెరిగి న పిచ్చి మొక్కలను తొలిగించేందుకు గడ్డి మందును పిచికారీ చే యించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటే ఈగలు, దోమలు ఎక్కువగా సంచరించే అవకాశం ఉందన్నారు. మురుగు కాల్వల్లో మురుగు నిలువలేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...